పొన్నూరు ఆలయాలకు రూ.2.13 కోట్లు మంజూరు
GNTR: ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర విజ్ఞప్తి మేరకు చేబ్రోలు మండల ఆలయాల అభివృద్ధికి రూ.2.13 కోట్లు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. నారాకోడూరు గణపలింగేశ్వర స్వామి ఆలయానికి రూ.1.20 కోట్లు, శలపాడు రామలింగేశ్వర స్వామి ఆలయానికి రూ.93.33 లక్షలు విడదలైయ్యాయి. సీఎం చంద్రబాబు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో ఈ నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు.