టవర్ ఎక్కి సర్పంచ్ అభ్యర్థి ఆందోళన
TG: మెదక్(D) నార్సింగి(M) పెద్దతండా గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పెద్ద తండా సర్పంచ్ అభ్యర్థి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టాడు. తనను ఓడించేందుకు ప్రత్యర్థి అభ్యర్థి కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు. ఓటర్లకు ఒక్కో ఓటుకు రూ.2 వేలు పంపిణీ చేశారని ఆయన వాపోయారు. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.