VIDEO: ఉద్రిక్తంగా మారిన ఎమ్మెల్యే పర్యటన
SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస గ్రామంలో ఇవాళ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు స్థానిక రైతులు, గిరిజనులు వ్యతిరేక నినాదాలతో నిరసన తెలిపారు. “థర్మల్ పవర్ ప్లాంట్ మాకు వద్దు” అంటూ గ్రామస్తులు గట్టిగా నినదించడంతో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం భారీ పోలీసు బందోబస్తు నడుమ ఎమ్మెల్యే గ్రామంలోకి ప్రవేశించారు.