రేషన్ కార్డుదారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్

E.G: రేషన్ కార్డుదారులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి రేషన్ కార్డు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ మంగళవారం పేర్కొన్నారు. కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల చేరిక-తీసివేత, చిరునామా మార్పులు వంటివి చేసుకోవచ్చని, అర్హత లేకుండా రాయితీ పొందుతున్నవారు, కార్డులను సరెండర్ చేయాలన్నారు.