బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళం మండలం కొమరవాణిపేట గ్రామానికి చెందిన కొమర కోటయ్య, చీకటి నాగేశ్వరరావు అనారోగ్యంతో మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.