దేవాదుల పంపు హౌస్ పరిశీలన
HNK: హసన్ పర్తి మండలం దేవన్నపేట శివారులోని దేవాదుల పంప్ హౌస్, ధర్మసాగర్‌లోని రిజర్వాయర్, సౌత్ మెయిన్ కెనాల్‌ను కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కాంతారావు శుక్రవారం సందర్శించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు కేంద్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శికి వివరించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.