'పోషకాహార లోపం లేకుండా చూడాలి'
KRNL: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహార లోపం లేకుండా చూడాలని సీడీపీఓలను జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఉదయం 9 గంటలకు కేంద్రాలు తెరచి, పిల్లల ఎత్తు, బరువు ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. తల్లులకు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, వాట్సాప్ గ్రూపుల ద్వారా పోషకాహారంపై వీడియోలు పంపాలని ఆమె సూచించారు.