కొండపల్లి బొమ్మలు ఏ కర్రతో చేస్తారంటే..?
కృష్ణా: 14వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించిన కొండపల్లి కోట ఆనాటి నిర్మాణ చాతుర్యానికి ప్రతీక. కొండపై ఉన్న ఈ కోట పర్యాటకులకు అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఇక ఇక్కడ తయారయ్యే కొండపల్లి బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. 'పొనుకు' అనే తేలికపాటి కర్రతో, సహజ సిద్ధమైన రంగులను ఉపయోగించి వీటిని రూపొందిస్తారు. ఈ అద్భుతమైన హస్తకళకు ప్రభుత్వం 'జియోగ్రాఫికల్ ఇండికేషన్' (GI) గుర్తింపునిచ్చింది.