సామాన్యుడిని వేధిస్తోన్న 'సమస్యలు'
MDK: గత కొన్ని రోజులుగా ప్రజలను వరుస సమస్యలు తీవ్రంగా వెంటాడుతున్నాయి. మొన్నటి వరకు గ్యాస్, పెట్రోల్ కొరతతో ప్రజలు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి కొంత ఉపశమనం లభించింది అనుకునే లోపే ఇవాళ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 'సమస్యలు కేవలం సామాన్యునికేనా' అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.