'DSC-2025 రిక్రూట్‌మెంట్ జాబితా చెక్ చేస్కోండి'

GNTR: జిల్లాలో మెగా డీఎస్సీ-2025కి సంబంధించిన అన్ని కేటగిరీల రిక్రూట్‌మెంట్ జాబితాను deognt.blogspot.com వెబ్‌సైట్‌లో ఉంచినట్లు సోమవారం డీఈఓ సి.వి. రేణుక తెలిపారు. ఈ జాబితాను డీఈఓ కార్యాలయం, కలెక్టరేట్‌లోని డిస్‌ప్లే బోర్డుల్లో ప్రదర్శిస్తామని ఆమె చెప్పారు. అదనపు సమాచారం కోసం డీఈఓ కార్యాలయంలోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.