బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే

బుచ్చిరెడ్డిపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే

NLR: బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని స్థానిక 11వ వార్డులో MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించారు. వార్డులోని ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలూరు మహిళలు తమకు సీసీ రోడ్లు కావాలని, డ్రైనేజీలు వేయాలని, ఆగిన గృహ నిర్మాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని,పెన్షన్లను అందజేయాలని కోరారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని MLA హామీ ఇచ్చారు.