మర్రిపూడిలో గాలికుంటు నివారణ టీకాలు పంపిణీ
ప్రకాశం: మర్రిపూడి మండలంలో అన్ని గ్రామాల్లో నాలుగు నెలలు దాటిన ప్రతి గేదెకు, ఆవుకు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి మంచికల మనిశేఖర్ మాట్లాడుతూ.. పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.