హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
SRPT: మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని 124 గ్రామపంచాయతీలకు నిర్వహించిన పోలింగ్ విజయవంతంగా ముగిసింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని అధికారులు తెలిపారు. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానుంది.