'పంటల బీమాతో రైతులకు మేలు'
VZM: పంటల బీమాతో రైతులకు మేలు కలుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు అన్నారు. గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో మంగళవారం రబీ పంట నమోదును రామారావు పరిశీలించారు. ఈ పంట నమోదుతో పంటకు మద్దతు ధరతో పాటు పంట నష్టం వచ్చినప్పుడు నష్టపరిహారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ అలజంగి నిర్మల జ్యోతి, మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.