కొండాపూర్ గ్రామ సర్పంచ్‌గా గంగవ్వ

కొండాపూర్ గ్రామ సర్పంచ్‌గా  గంగవ్వ

JGL: కొడిమ్యాల మండలం కొండాపూర్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో సామంతుల గంగవ్వ గెలుపొందారు. గతంలో ఆమె కుమారుడు ప్రభాకర్ సర్పంచ్‌గా గెలిచి సేవలు అందించారు. ఈ గెలుపుతో కొండాపూర్ గ్రామంలో ఆమె అనుచరులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఓటు వేసి గెలిపించిన వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.