'విద్యార్థినిల ఆరోపణలు నిజమే'
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలు ఎకనామిక్స్ గెస్ట్ లెక్చరర్ నారాయణరావుపై చేసిన వేధింపుల ఆరోపణలు నిజమేనని ప్రిన్సిపల్ డాక్టర్ రాజు అంగీకరించారు. విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఫైవ్ మెంబర్స్ కమిటీ వేశామని పేర్కొన్నారు. కమిటీ విచారణ ముందు నారాయణరావు చేసిన తప్పులు ఒప్పుకుని వెంటనే గెస్ట్ లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేశారన్నారు.