తహసిల్దార్‌కు CPI నాయకుల వినతి
ATP: రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరుతూ మంగళవారం గుత్తి తహసిల్దార్ కార్యాలయం ఎదుట CPI ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. CPI పట్టణ, మండల కార్యదర్శులు రామదాసు, రాజు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలపై దాడులు అరికట్టడంతో పాటు జనగణన, కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు.