ఉప్పల్ ప్రధాన రహదారులపై కుక్కల స్వైర విహారం

మేడ్చల్: ఉప్పల్ వరంగల్ జాతీయ రహదారి, చిల్కానగర్ వెళ్లే మండే మార్కెట్ ఏరియాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీంతో అటువైపుగా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. నైట్ షిఫ్ట్ డ్యూటీ చేసి వస్తున్న మహిళలు, భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. దీనిపై జీహెచ్ఎంసీ యంత్రాంగం తగిన విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.