మోటార్లు దొంగిలించిన దుండగులు
NZB: ఇందల్వాయి గ్రామ శివారులో మర్రోడుకుంట్లలో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వరి కోత కోసే హార్వెస్టర్ చైన్ మిషిన్ నుంచి రెండు మోటార్లను దొంగిలించినట్లు యాజమాని తెలిపారు. వాటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. ఇవాళ ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్ వెల్లడించారు.