ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన గ్రంధాలయ సంస్థ ఛైర్మన్

ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించిన గ్రంధాలయ సంస్థ ఛైర్మన్

KMR: బిక్కనూరు మండలం అయ్యవారిపల్లిలో ఇందిరమ్మ ఇల్లును బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రకాంత్ రెడ్డి ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పేద కుటుంబాల ముఖాల్లో చిరునవ్వు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు.