గ్రామ సచివాలయంలో ఆధార్ స్పెషల్ డ్రైవ్

SKLM: బూర్జ మండలం డొంకలపర్త సచివాలయంలో ఆధార్ స్పెషల్ డ్రైవ్ రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు సచివాలయం సిబ్బంది తెలిపారు. ఈనెల 12, 13 తేదీలు అనగా సోమ, మంగళవారం ఆధార్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆధార్‌కి సంబంధించిన తప్పుల సవరణ, ఆధార్ అప్డేట్స్, చిరునామా మార్పు వంటివి వాటి కోసం సచివాలయంలో మీ ఆధార్‌తో వచ్చి ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు.