VIDEO: ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
ప్రకాశం: గిద్దలూరులోని జడ్పీ హైస్కూల్లో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో విద్యా బోధన, మౌలికవసతులు, విద్యార్థుల హాజరు వంటి అంశాలను పరిశీలించి, ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యాస స్థాయిని తెలుసుకొని, మరింత మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని ప్రోత్సహించారు.