జగన్‌పై దేవినేని ఉమా ఫైర్

జగన్‌పై దేవినేని ఉమా ఫైర్

NTR: మాజీ మంత్రి దేవినేని ఉమ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. జగన్‌కు ధైర్యం ఉంటే అమరావతికి వచ్చి అభివృద్ధిని కళ్లారా చూడాలని సవాలు చేశారు. అక్రమాలకు పాల్పడిన వారికోసం జైలు యాత్రలు మానేసి అమరావతి రావాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.