క్వారీ లీజులకు పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

క్వారీ లీజులకు పర్యావరణ అనుమతి తప్పనిసరి: కలెక్టర్

KMR: జిల్లాలో కొత్త, రెన్యువల్ మైనింగ్, క్వారీ లీజుల మంజూరుకు రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ గురువారం ప్రకటించారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ డ్రాఫ్ట్ 2 kamareddy.telangana.gov.in వెబ్‌సైట్‌ను పొందుపరిచినట్లు పేర్కొన్నారు. నివేదికపై అభ్యంతరాలు ఉన్నవారు ఈ నెల 21వ తేదీలోపు జిల్లా మైనింగ్ కార్యాలయానికి పంపాలన్నారు.