నలుపు రంగు చీరలతో అంగన్వాడీలు నిరసన

W.G: అంగన్వాడి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నలుపురంగు చీరలతో అంగన్వాడీ కార్యకర్తలు గురవారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ఇరగవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు అడ్డగర్ల అజయ్ కుమారి మాట్లాడుతూ.. అంగన్వాడి కార్యకర్తలు చేత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని అన్నారు.