కలెక్టర్, ఎంపీ ఆధ్వర్యంలో పింఛన్ పంపిణీ
KRNL: కలెక్టర్ డా. ఏ.సిరి, నగర ఎంపీ నాగరాజు శనివారం లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. అనంతరం వారు గ్రామంలోని ఉర్దూ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ పేదల పక్షాన ఉంటుందని ఎంపీ తెలిపారు. అలాగే, విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు.