ఉమ్మడి జిల్లాలో 18 లక్షల పల్లే ఓటర్లు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో పంచాయతీ ఓటర్ల జాబితాను అధికారులు వెల్లడించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 785 గ్రామ పంచాయతీల్లో 18,51,149 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 8,99,944 మంది పురుషులు, 9,51,143 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 62 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. అత్యధికంగా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్లో 4,11,589 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.