ఉప్పల్‌కు మెస్సీ.. అప్రమత్తమైన సిబ్బంది

ఉప్పల్‌కు మెస్సీ.. అప్రమత్తమైన సిబ్బంది

HYD: కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో గందరగోళ వాతావరణం నెలకొంది. మెస్సీ మ్యాచ్ ఆడకుండా త్వరగా వెళ్లాడని అభిమానులు స్టేడియంలోని సీట్లు ధ్వంసం చేసి, వాటర్ బాటిళ్లను విసురుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం, స్టేడియం సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమైనట్లు సమాచారం.