'విద్యుత్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి'
NZB: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. మంగళవారం బోధన్‌లోని పీఆర్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సవరణల వల్ల సామాన్య రైతాంగానికి ఒరిగేదేమీ లేకపోగా, తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.