ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గుడిసె దగ్ధం

ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గుడిసె దగ్ధం

KRNL: కోసిగి మండలం అగసనూరు గ్రామ సమీప పొలాల్లో తిప్పన్న తాత మఠానికి చెందిన గుడిసె ప్రమాదవశాత్తు గురువారం దగ్ధమైంది. పక్కనున్న పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు గుడిసెకు అంటుకున్నాయి. స్థానికులు మంటలు ఆర్పేలోగా గుడిసె పూర్తిగా కాలిపోయింది. వంట సామాగ్రి, గుడిసెలో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోగా, రూ.50వేల మేర నష్టం వాటిల్లినట్లు తెలిపారు.