మే 1 నుంచి విద్యార్థులకు వివిధ క్రీడల్లో శిక్షణ

కృష్ణా: గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియం ఆధ్వర్యంలో విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతుల్లో భాగంగా వివిధ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. మే 1 నుంచి 28వ తేదీ వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని నిర్వాహకులు పేర్కొన్నారు. అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, చెస్, క్రికెట్, కబడ్డీ, కరాటే, ఖోఖో తదితర అంశాల్లో శిక్షణ ఉంటుందన్నారు.