వరిధాన్యం కొనుగోళ్లు త్వరలోనే ప్రారంభిస్తాం: కలెక్టర్
BHNG: ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో ప్రారంభించి ఒకటి రెండు రోజులలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. మంగళవారం ఆయన వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం, మందాపురం, నాతాళ్ళగూడెం, రెడ్లరేపాక గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.