భక్తులు జాగ్రత్తలు పాటించాలి: ఆర్డీవో
కోనసీమ: కె.గంగవరం మండలంలోని కోటిపల్లి గోదావరి పుష్కర ఘాట్ వద్ద మహా శివరాత్రి సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించే భక్తులు జాగ్రత్తలు పాటించాలని రామచంద్రపురం ఆర్డీవో అఖిల సూచించారు. ఆమె స్థానిక అధికారులతో కలిసి కోటిపల్లి పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.