రూడ్ సెట్ సంస్థ లో ఏసీ రిపేర్, ఫ్రిడ్జ్ రిపేర్ నందు ఉచిత శిక్షణ

రూడ్ సెట్ సంస్థ లో ఏసీ రిపేర్, ఫ్రిడ్జ్ రిపేర్ నందు ఉచిత శిక్షణ

 ప్రకాశం: ఒంగోలు రూడ్ సెట్ సంస్థలో మే 21తేదీ నుంచి 30 రోజుల పాట ఏసీ రిపేర్, ఫ్రిడ్జ్ రిపేర్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకూ చెంది ఉండి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పించబడునని తెలిపారు.