VIDEO: రంజాన్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి
NLG: రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మత కలహాలు లేకుండా సోదరభావంతో, ఐక్యతతో రంజాన్ పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్గొండ పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. గత 30 రోజులుగా ముస్లింలు కఠోర దీక్షలు, ప్రార్థనలు చేశారని తెలిపారు.