'అక్షర ఆంధ్ర' పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతగ్రామ్ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన ‘అక్షర ఆంధ్ర’ FLNAT పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అభ్యాసకులందరూ తప్పనిసరిగా పరీక్షకు హాజరయ్యేలా చూడాలని ఇన్విజిలేటర్లకు సూచించారు. పరీక్ష అనంతరం జవాబు పత్రాలు, అటెండెన్స్, అవార్డు లిస్టులను అప్పగించాలని తెలిపారు.