VIDEO: తిరుమలకు పాదయాత్రగా తరలిన భక్తులు

CTR: తిరుమల శ్రీవారి దర్శనం కోసం శుక్రవారం పుంగనూరు నుంచి భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. స్థానిక కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. గరుడసేవ సంఘం ఆధ్వర్యంలో సుమారు 200 మంది భక్తులు దర్శనానికి తరలి వెళ్లారు. యాత్ర ఈనెల 30న తిరుమలకు చేరుకోనున్నట్లు భక్తులు తెలిపారు.