VIDEO: టిప్పర్ల నిర్లక్ష్యం.. వాహనదారుల ఇబ్బందులు

VIDEO: టిప్పర్ల నిర్లక్ష్యం.. వాహనదారుల ఇబ్బందులు

ప్రకాశం: కనిగిరి నుంచి గార్లపేట వెళ్లే రోడ్డులో గ్రానైట్ క్వారీల వద్ద టిప్పర్లు నిర్లక్ష్యంగా తిరుగుతున్నాయి. రాళ్లతో లోడైన టిప్పర్లకు వెనుక డోర్ మూత వేయకుండా వెళ్లడంతో రాళ్లు జారి కింద పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దీనిపై స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తూ, సంబంధిత అధికారులు స్పందించి టిప్పర్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.