పాతపట్నంలో ప్రజా దర్బార్ కార్యక్రమం

పాతపట్నంలో ప్రజా దర్బార్ కార్యక్రమం

SKLM: పాతపట్నంలో తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గురువారం "ప్రజాదర్బార్" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వెంటనే ఆయన స్పందించి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్‌ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.