రేపటి నుండి 'సంసద్ ఖేల్ మహోత్సవ్' క్రీడా పోటీలు

రేపటి నుండి 'సంసద్ ఖేల్ మహోత్సవ్' క్రీడా పోటీలు

E.G: అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా బుధవారం 'సంసద్ ఖేల్ మహోత్సవ్' క్రీడా పోటీలు ప్రారంభం కానున్నాయి. గ్రామీణ యువ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. బిక్కవోలు వేదికగా జరిగే ఈ క్రీడా సంబరాలను MLA నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించనున్నారు. క్రీడాకారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.