నాడు భర్త ఎంపీటీసీ... నేడు భార్య సర్పంచ్

నాడు భర్త ఎంపీటీసీ... నేడు భార్య సర్పంచ్

మంచిర్యాల: జన్నారం మండలంలోని చింతగూడా గ్రామానికి చెందిన సుతారి సుమలత వినయ్ దంపతులు రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. గ్రామంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సుతారి సుమలత సర్పంచ్‌గా విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఆమె భర్త సుతారి వినయ్ ఎంపీటీసీగా గెలిచి జన్నారం మండలానికి వైస్ ఎంపీపీగా పని చేశారు. చింతగూడ గ్రామ అభివృద్ధిలో వారు కీలక పాత్ర పోషిస్తున్నారు.