జోగి రమేష్ సోదరుల కస్టడీ పిటిషన్ వాయిదా

జోగి రమేష్ సోదరుల కస్టడీ పిటిషన్ వాయిదా

AP: జోగి రమేష్ సోదరుల కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈనెల 20వ తేదీకి వాయిదా వేస్తూ విజయవాడ కోర్టు తీర్పునిచ్చింది. ఎక్సైజ్ శాఖ అధికారులు జోగి రమేష్ సోదరులను 10 రోజులపాటు కస్టడీకి కోరినట్లు సమాచారం. అయితే, నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ సోదరులను నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం వారు నెల్లూరు జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.