VIDEO: మాజీ సీఎం ఫోటో ఫ్రేమ్‌లతో వ్యాపారం

VIDEO: మాజీ సీఎం ఫోటో ఫ్రేమ్‌లతో వ్యాపారం

W.G: దేవరపల్లి మండలం గౌరీపట్నంలో మేరిమాత ఉత్సవాలు బుధవారం అర్థరాత్రి ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఈ ఉత్సవాలలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫోటో ఫ్రేమ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దేవుళ్ళ ఫోటోల మధ్యలో వీటిని ఉంచడంతో, జగన్ అభిమానులు ఆసక్తిగా తిలకించి, కొనుగోలు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.