ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రకాశం: జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ప్రజల నుండి 20 అర్జీలను స్వీకరించారు. ఈ మేరకు వివిధ సమస్యలపై ప్రజలు ఎమ్మెల్యేను కలిసి అర్జీలు సమర్పించారు. అనంతరం సంబంధిత అధికారులతో మాట్లాడి, ప్రజలు ఇచ్చిన అర్జీల సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విజయ్ కుమార్ హామీ ఇచ్చారు.