హిందూపురంలో కొత్త నీటి మోటార్లు ప్రారంభం

హిందూపురంలో కొత్త నీటి మోటార్లు ప్రారంభం

సత్యసాయి: హిందూపురం నియోజకవర్గం నింకంపల్లి రోడ్, మున్సిపల్ శారదా పాఠశాల ప్రాంతంలోని వార్డుల్లో బుధవారం కొత్త నీటి మోటర్లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్‌పర్సన్ డిఈ. రమేష్ కుమార్ మోటర్లను ప్రారంభించారు. గొల్లపల్లి రిజర్వాయర్ నీటితో పాటు మోటార్ల ద్వారా అదనపు నీటి సరఫరా అందిస్తామని ఆయన తెలిపారు.