విద్యార్థులకు హాల్ టికెట్లు పంపిణీ చేసిన అధికారి
NLR: ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను RIO వరప్రసాద రావు చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో మంచి మార్కులతో అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించాలని కోరారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ కీలకమైన దశ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.