VIDEO: తొలి తిరుపతికి పోటెత్తిన భక్తులు
KKD: పెద్దాపురం మండలం తొలి తిరుపతి శృంగారం వల్లభ స్వామి దర్శనాలకు శనివారం భక్తులకు భారీగా తరలివచ్చారు. ఇవాళ ఒక్కరోజు స్వామివారికి రికార్డు స్థాయిలో రెండు లక్షల 35 వేల 436 రూపాయల ఆదాయం లభించినట్లు ఈవో వడ్డీ శ్రీనివాసరావు తెలిపారు. వేసవి కారణంగా భక్తులకు ఆలయ ప్రాంగణంలో మజ్జిగ, అన్న సంతార్పన చేశామన్నారు. అలాగే, అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.