వేసవి కాలం.. తీవ్ర నీటి సంక్షోభం
KMR: జిల్లాలో వేసవి ప్రారంభంలోనే నీటి సంక్షోభం తీవ్రమైంది. ఏప్రిల్ మొదటి వారంలోనే అనేక ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతుండటంతో ప్రజలు కొత్త బోర్లు తవ్విస్తున్నారు. మానేరు జలాశయం సమీపంలో కూడా ఇదే పరిస్థితి ఉండడం ఆందోళన కలిగిస్తోంది. నగరపాలక సంస్థ నల్లా నీటి సరఫరా సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇంకుడు గుంతలు తవ్వితే భూగర్భ జలాలు మెరుగుపడతాయని సూచిస్తున్నారు.