మహిళా సర్పంచులను సన్మానించిన DCC అధ్యక్షుడు
BHPL: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా వేడుకలు DCC అధ్యక్షుడు కరుణాకర్, మున్సిపల్ చైర్మన్ కొమురయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా DCC అధ్యక్షుడు కరుణాకర్ పలు గ్రామాల మహిళ సర్పంచులను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ఛైర్మన్ కృష్ణయ్య, కాంగ్రెస్ జిల్లా నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.