బురదలో మోకాళ్లపై విద్యార్థుల నిరసన

బురదలో మోకాళ్లపై విద్యార్థుల నిరసన

KDP: మైదుకూరు నియోజకవర్గం చాపాడు(మం) తిప్పిరెడ్డిపల్లెలో రహదారి లేక విద్యార్థులు, మహిళలు బురదలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. నెలలుగా దెబ్బతిన్న రోడ్డును మరమ్మతు చేయకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంబులెన్స్ కూడా గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. వెంటనే రహదారి నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు.